డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ కావాలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లవ్లీ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆదికి సరైన హిట్ దక్కలేదు. వరసగా సినిమాలను చేస్తున్నా కూడా మంచి సక్సెస్‌ను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.
ఆది ప్రస్తుతం ”అతిథి దేవోభవ” ,‘బ్లాక్’, అమరన్, కిరాతక అనే సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9 : 45 కి ప్రారంభం కానుంది .ఈ సినిమాకి శివశంకర్ దేవ్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు.తాజాగా సినిమా పోస్టర్స్ విడుదల చేయగా, ఇందులో రెండు చేతులు ఓ పిస్టల్ ను పట్టుకొని ఉన్నాయి. ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం రూపొందనుందని అర్ధమవుతుంది.