అశ్విన్‌బాబు హీరోగా మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వంలో టి.గణపతిరెడ్డి రూపొందిస్తున్న మెడికల్ యాక్షన్ మిస్టరీ ‘వచ్చినవాడు గౌతమ్’. ఇవాళ (ఆగస్టు 1) అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ మేకర్స్ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అశ్విన్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్’ అంటూ మంచు మనోజ్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే టీజర్ కథానేపథ్యం, యాక్షన్ ఆసక్తిని రేకిత్తించాయి.
ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఇటీవల భారీ బడ్జెట్‌తో హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. హై టెక్నాలజీతో ఈ యాక్షన్ సీక్వెన్స్ తీశారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. M R వర్మా ఎడిటర్.