జూనియర్ సమంతగా డబ్ స్మాష్లో అదరగొట్టిన అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో సెలబ్రిటీ స్టేటస్ అందుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని నానా రచ్చ చేసిన ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో తన అందాలతో కుర్రకారుకి గాలమేస్తుంది. పనిలో పని వార్తలలో నిలిచేందుకు కొన్ని వీడియోలు చేస్తూ హంగామా సృష్టిస్తుంది.
తాజాగా అషూ రెడ్డి ప్రగ్నెన్సీ పేరుతో ఓ ప్రాంక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టేసింది. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న అషూ రెడ్డిని ఏమైందని తల్లి ప్రశ్నించగా.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. ఈ విషయాన్ని ముందు తల్లి నమ్మలేదు. కాని అషూ అదే పనిగా ఏడుస్తూ ఉండడంతో షాక్ అయిపోయింది. కోపం తట్టుకోలేక ఆమె తల్లి అషుని కొట్టడం, కాలితో తన్నడం కూడా చేసింది.
తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడిన అషూ చివరకు ఇది ప్రాంక్ వీడియో అని, నిజం కాదని చెప్పేసింది. రూమ్లో పెట్టిన కెమెరాలను కూడా చూపించింది. దీంతో అషూ తల్లికి మరింత కోపం వచ్చింది . రెండు మొట్టికాయలు కూడా వేసింది. హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేశావు అంటూ సీరియస్గా వెళ్లిపోయింది అషూ తల్లి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.