ఓ వైపు జూనియర్ సమంత (junior Samantha), మరోవైపు బిగ్ బాస్ షోతో చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అరియానా గ్లోరీ..ఈ ఇద్దరూ కలిసి అందాలు ఆరబోస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా నెట్టింట్ట వైరల్ అవుతున్న ఈ స్టిల్ లా ఉంటుంది. గ్రీన్ డ్రెస్‌లో నాభి అందాలను చూపిస్తూ అరియానా (Ariana Glory), బ్లాక్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా కనిపిస్తూ అశురెడ్డి (Ashu Reddy) కలిసి దిగిన స్టిల్ ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అశురెడ్డి పాపులర్ యూట్యూబరే కాదు..వెబ్‌లో జూనియర్ సమంతగా అందరికీ సుపరిచితురాలు.
వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్క సారిగా పాపులర్ అయింది..బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ సంపాదించింది అరియానా. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న అశు గ్రీన్ డ్రెస్‌లో ఉన్న అరియానా నడుముపై ముద్దు పెడుతుంటే..అరియానా రొమాంటిక్‌గా సిగ్గుపడుతున్న స్టిల్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అశురెడ్డి..అనంతమైన వ్యక్తీకరణ అంటూ క్యాప్షన్ పెట్టింది.
దీనికి అరియానా స్పందిస్తూ..ఒసేయ్ అశు నీకు నీ క్రేజీనెస్‌కి దండం తల్లి..పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే..జడ్జిమెంటల్ అవుతున్నాం. ఏదైమైనా నువ్వు క్రేజీ ఉమెన్‌వి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.