ముంబై: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఓ క్రూయిజ్ రేవ్ పార్టీలో ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 24 ఏళ్ల ఆర్యన్ వద్ద ఉన్న పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. అయితే మానసిక వత్తిడిలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసేన్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఆర్ఫిన్ ఖాన్ వద్ద కౌన్సిలింగ్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆర్యన్ ఖాన్‌కు కూడా ఆర్ఫీన్ ఖాన్ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఓ మీడియా సంస్థ కథనాన్ని రాసింది. ఆర్యన్ అరెస్టు అయిన సమయంలో అతనికి హృతిక్ అండగా నిలిచాడు. సోషల్ మీడియా ఆర్యన్‌కు సపోర్ట్ ఇస్తూ ఓ పోస్టు కూడా చేశాడు.