ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై చాలా ఘాటైన రిప్లై ఇచ్చింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసును రియా చక్రవర్తి, షోవిక్ కేసుతో పోల్చింది. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఏవీ దొరకనంత మాత్రాన అతనికి బెయిల్ ఇవ్వాలని ఏమీ లేదని ఏఎస్జీ అనిల్ సింగ్ కోర్టులో వాదించారు. గతంతో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి దగ్గర కూడా ఎలాంటి డ్రగ్స్ లభించకపోయినా.. దీనిపై విచారణ జరగాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్యన్ ఖాన్ గత కొన్నేళ్లుగా రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకుంటాడని మీ ముందు ఉన్న రికార్డు, ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్యన్ ఫ్రెండ్ అర్బాజ్ ఖాన్ దగ్గర లభించిన డ్రగ్స్ వాళ్లిద్దరూ తీసుకోవడం కోసమే అని అనిల్ సింగ్ వాదించారు. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఆయన కోర్టును కోరారు.