Arya captain First Look | తమిళ హీరో ఆర్య పరిచయం అక్కర్లేని పేరు. ‘వరుడు’ సినిమాతో ఆర్య తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఆర్య మెప్పించాడు. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలు కొన్ని యూట్యూబ్‌లో డబ్బింగ్ వెర్షన్లుగా విడుదల కాగా మరికొన్ని నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈయన తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇక ఆర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్’. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆర్య ఆర్మీ అధికారిగా నటించాడు. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. సిమ్రాన్ కీలకపాత్రలో నటించింది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. గతంలో ఆర్య, శక్తి రాజన్ కాంబోలో వచ్చిన ‘టెడ్డీ’ నేరుగా డిస్నీలో విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది.
Here’s the first look of #Captain 👍 you are just an awesome writer – director brother @ShaktiRajan 😘😘🤗🤗🤗@SimranbaggaOffc @AishuLekshmi @immancomposer @madhankarky @tkishore555 @NxgenMedia @gopiprasannaa @ThinkStudiosInd @thinkmusicindia #TheShowPeople #CaptainFirstLook pic.twitter.com/ENlAvquerJ
— Arya (@arya_offl) April 4, 2022