టాలీవుడ్ యువ నటుడు అరవింద్ కృష్ణ (Arvind krishna)కు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ యువ హీరో లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం అండర్ వరల్డ్ బిలియనీర్స్ (UNDER World Billionaires). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గగన్ గోపాల్ ముల్క డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంఛ్ చేశారు మేకర్స్.
అరవింద్ కృష్ణ బ్లాక్ గాగుల్స్ లో స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. మిగిలిన పాత్రలు కూడా ఫస్ట్ లుక్‌లో చూపించాడు డైరెక్టర్. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం మమత, ఎం రాజరాజేశ్వర్ సమర్పణలో ఎం శ్రీనివాసులు, డీ వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు దర్శకుడు.
అరవింద్ కృష్ణ నటిస్తోన్న మరో సినిమా ఏ మాస్టర్ పీస్ (AMasterpiece). సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తెలుగు సూపర్ హిరోగా అరవింద్ కృష్ణ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఏ మాస్టర్ పీస్ లుక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఆంధ్రాపోరీ, ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ కృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు.
వరల్డ్ బిలియనీర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ..
The intense first look of #ArvindKrishna 's action thriller #UNDERWorldBillionaires is out now#GaganGopalMulka#LSProductions#MSrinivasulu #DVenuGopal#SChinna#TSurendraReddy#JunaidSiddique@PROSaiSatish pic.twitter.com/t1QQ8Cj0k2
— BA Raju's Team (@baraju_SuperHit) January 11, 2023