ఇటీవలే ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు మలయాళీ అగ్ర నటుడు మోహన్‌లాల్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ‘సీవోఏఎస్ కమెండేషన్’ కార్డును అందుకున్నారు మోహన్‌లాల్. ఆర్మీలో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ కార్డును ప్రదానం చేస్తారు.
2009 నుంచి టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నారు మోహన్‌లాల్. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ..‘ఏడుగురు ఆర్మీ కమాండర్స్ సమక్షంలో ‘సీవోఏఎస్ కమెండేషన్’ కార్డును అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీతో పాటు యావత్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు.