అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఓ మెరుపు మెరిసింది జబల్ పూర్ సుందరి షాలిని పాండే (Shalini Pandey). విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్‌ను షేక్ చేయడమే కాదు..షాలినీకి ఇండియావైడ్‌గా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కీర్తిసురేశ్ లీడ్ రోల్ చేసిన మహానటి (Mahanati)లో కీలకపాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఈ సినిమా తర్వాత మెల్లమెల్లగా మేకోవర్ మార్చుకునే పని పెట్టుకుని..కంప్లీట్ స్లిమ్‌గా మారిపోయింది. ఈ భామ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నది. డెనిమ్ షార్ట్స్ (denim shorts), బ్లూ లో నెక్ టాప్ (blue low neck top)లో ఎద అందాలను ఆరబోస్తూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. సెలయేరు జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో చిరునవ్వు నవ్వుతూ ఉన్న స్టిల్స్ కుర్ర కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Beautiful #ShaliniPandey latest pics pic.twitter.com/70hGrKSwxq
— Vamsi Kaka (@vamsikaka) April 26, 2022
తాజా ఫొటోషూట్ తో హీరోయిన్ల కోసం వెతుకుతున్న దర్శకనిర్మాతలకు కొత్త ఆశలు కల్పించేలా చేస్తోంది షాలినీ పాండే. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్‌తో కలిసి జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు మహారాజా సినిమా కూడా చేస్తోంది.