బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లో అర్జున్ రాంపాల్ పాల్గొంటున్నారు. హీరోతో ఢీ అంటే ఢీ అనేలా ఈ నటుడి క్యారెక్టర్ ఉంటుందని చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉన్న ఈ సినిమాను దసరా పండుగకు విడుదల చేయబోతున్నారు.