Arjun Kapoor | మలైకాతో వెడ్డింగ్..అర్జున్ కపూర్ రియాక్షన్ ఇదే
మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor). ఈ ఇద్దరూ ఎప్పుడు ఏదో ఒక స్టిల్‌తో నెట్టింట కనిపిస్తూ ఆన్ లైన్లో హల్ చల్ చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వెకేషన్లో కలిసి కనిపిస్తూనే ఉంటారు.
బాలీవుడ్ (Bollywood)లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న జంటలు చాలానే ఉన్నాయి. అయితే వీరందరిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే లవ్ బర్డ్స్ మాత్రం మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor). ఈ ఇద్దరూ ఎప్పుడు ఏదో ఒక స్టిల్‌తో నెట్టింట కనిపిస్తూ ఆన్ లైన్లో హల్ చల్ చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వెకేషన్లో కలిసి కనిపిస్తూనే ఉంటారు. పండగలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ప్రతీ సారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ..హాట్ టాపిక్‌గా మారుతుంటారు.
కొన్ని రోజులుగా అర్జున్-మలైకా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నట్టు వస్తున్న వార్తలపై అర్జున్ కపూర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ అప్ డేట్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి నా జీవితం గురించి నా కంటే ఎక్కువగా తెలుసునని ఎలా అనిపిస్తుందో..అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ పెట్టాడు. తాజా పోస్టుతో ఈ వెడ్డింగ్ రూమర్స్ అన్నీ వట్టివేనని పరోక్షంగా చెప్పేశాడా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్, కుత్తే, ది లేడీ కిల్లర్ సినిమాల్లో నటిస్తున్నాడు అర్జున్ కపూర్. వీటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకోగా..ది లేడీ కిల్లర్ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు మలైకా అరోరా ఫిట్ నెస్, యోగా పాఠాలతో నెటిజన్లు, ఫాలోవర్లు అందరిని పలుకరిస్తుంటుంది.
ead Also : ‘ఎఫ్3’ మూవీ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించామంటే : దిల్ రాజుతో F3 ముచ్చట్లు
Read Also : Niharika lip lock | చైతన్యతో నిహారిక లిప్‌లాక్..ఇంతకీ ఎక్కడికెళ్లారో..!
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

