Leo | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న లియో నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఇందులో అర్జున్ హెరాల్డ్ దాస్‌గా నటిస్తున్నాడు.
ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో (Glimpse of Harold Das)ను లాంఛ్ చేశారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. గ్లింప్స్ వీడియోలో సిగరెట్ తాగుతూ ఊరమాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు అర్జున్. లియో చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.
యాక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ ఈ మూవీకి డైలాగ్స్ అందిస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..