Family Stars| బిగ్ బాస్ షోతో చాలా మంది సెలబ్రిటీలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరియనా, అషూ రెడ్డిలు కూడా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. తమదైన టాలెంట్‌తో ప్రేక్షకుల మెప్పు పొందారు. ఒకసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లడమే చాలా కష్టమే అంటే వీళ్లిద్దరు రెండు సార్లు హౌజ్‌లోకి వెళ్లి తెగ రచ్చ చేశారు. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఒక్కసారి ఇద్దరి పేర్లు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఏంది వీళ్లద్దరు ఇలా తయారు అయ్యారు. ఏంటి ఈ రచ్చ అంటూ కొందరు దారుణంగా ట్రోలింగ్ చేశారు. అయిన తగ్గలేదు. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షోతో నానా రచ్చ చేస్తున్నారు.
ఇక ఈ ఇద్దరు తాజాగా సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో కనిపించారు. రీసెంట్గా ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా, ఇందులో అషు రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం తనకు కొంత హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అయితే అప్పుడు ఒక ఫ్రెండ్ నుంచి తాను కనీసం కాల్ అయిన ఎక్స్పెక్ట్ చేశాను. తను మాత్రం అలా చేయలేదు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు అరియానానే అని అషూ రెడ్డి తెలిపింది. వెంటనే అరియానా రియాక్ట్ అవుతూ.. ఇన్ని రోజులు నువ్వు ఇది మనసులో పెట్టుకున్నావా.. నేను కాల్ చేసినప్పుడు మీ హెయిర్ డ్రెస్సర్ కాల్ లిఫ్ట్ చేశారని తెలిపింది.. మీ అమ్మగారికి కూడా రెండు మూడు సార్లు కాల్ చేశాను మళ్లీ చేపిస్తానని చెప్పింది.
కానీ ఒక సర్జరీ అయిన పేషెంట్ వీడియో కాల్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అని అషు రెడ్డి అనగా, తర్వాత అరియానా మధ్యలో ఎంటర్ అయి ఫైట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది. మరి అసలు ఎపిసోడ్లో ఏం జరుగుతున్నదనేది ఆసక్తికరంగా మారింది. కాగా, అరియానా, అషు రెడ్డీ వీరిద్దరూ కూడా టిక్ టాక్ ఇంస్టాగ్రామ్, రీల్స్ వల్లే బాగా క్రేజ్ అయితే సంపాదించుకున్నారు..అషు రెడ్డీ యాంకర్ గానే కాకుండా కొన్ని చిత్రాలలో కూడా కనిపిస్తూ ఉన్నది. నిరంతరం సోషల్ మీడియాలో అయితే హాట్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ