Mahatma Gandhi | జాతిపిత మహాత్మా గాంధీపై వెబ్ సిరీస్ రాబోతుంది. ఇప్పటివరకు గాంధీజీపై ఎన్నో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాత్ముడి జీవిత కథతో మరో వెబ్ సిరీస్ రాబోతుంది. స్కామ్ 1992, అలీఘర్, షాహిద్, స్కూప్ వంటి సంచలన చిత్రాలు తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్కు దర్శకత్వం వహించబోతుండగా.. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో నిర్మించబోతుంది. ఈ సినిమాలో గాంధీజీ పాత్రలో స్కామ్ 1992 నటుడు ప్రతీక్ గాంధీ నటించబోతున్నాడు.
అయితే ఈ వెబ్ సిరీస్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ పంచుకున్నారు. ఈ సిరీస్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్భంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయబోతున్నా. ఈ చిత్రంలో గాంధీజీ జీవితం, సౌత్ ఆఫ్రికాలో ఆయన గడిపిన క్షణాలు, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం గురించి ఉండబోతున్నట్లు తెలిపాడు. హన్సల్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్కు సంగీతం అందించడం గౌరవంగా ఉందంటూ రెహమాన్ తెలిపాడు.
On the occasion of Gandhi Jayanti, remembering the Mahatma and thrilled to announce this very special collaboration! 🎶@ApplauseSocial @nairsameer @mehtahansal@SegalDeepak @sidkhaitan@pratikg80@prasoon_garg @PriyaJhavar @devnidhib #KishoreAthwal #Gandhi pic.twitter.com/cFJw0qI6Zu
— A.R.Rahman (@arrahman) October 2, 2024