AR Rahman’s selfie with Hans Zimmer | ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణం’ సినిమా కోసం వీరు ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, ఈ సెల్ఫీ అభిమానుల్లో అంచనాలను పెంచుతుంది.
బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో రామాయణం ఒకటి. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు యష్, లక్ష్మణుడి పాత్రలో రవిదూబే, హనుమంతుడి పాత్రలో సన్నీ డేవోల్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్ర నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు ఇద్దరూ దిగ్గజ సంగీత దర్శకులు సంగీతం అందించబోతున్నారు. హాలీవుడ్ దిగ్గజం ఆస్కార్ అవార్డు విన్నర్ హన్స్ జిమ్మర్తో పాటు ఇండియన్ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నాడు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్టు వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గురువారం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత, ఏఆర్ రెహమాన్ తన సోషల్ మీడియాలో హాన్స్ జిమ్మర్తో కలిసి ఉన్న ఈ ఫోటోను పంచుకున్నారు. “With @hanszimmer #ramayanamovie” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ క్షణాల్లో వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఈ కాంబినేషన్‌పై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సెల్ఫీ చూసిన నెటిజన్లు “రెండు దిగ్గజాలు కలిసి ఏదో భారీగా సృష్టిస్తున్నాయి,” “దశాబ్దపు ఫ్రేమ్,” “ARR x HZ” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లానా గాట్లీబ్ వంటి ప్రముఖులు దీన్ని “ఐకానిక్” అని అభివర్ణించగా, అర్మాన్ మాలిక్ వారిని లెజెండ్స్ అని ప్రశంసించారు.
‘రామాయణం’ చిత్రానికి సంగీతం అందించడం ద్వారా హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత డీఎన్ఈజీ వీఎఫ్ఎక్స్ స్టూడియో కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో, ‘రామాయణం’ దృశ్య, శ్రవ్య అద్భుతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.