April First Week Theater/Ott Releases | గతవారం ‘దసరా’తో థియేటర్లు హోరెత్తిపోయాయి. యూత్, ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. వీకెండ్సే అనుకుంటే వీక్ డేస్‌లోనూ దసరా అదరగొడుతుంది. సంక్రాంతి తర్వాత దాదాపు మూడు నెలలలకు మళ్లీ బాక్సాఫీస్ కనక వర్షంతో కళకళలాడుతుంది. ఎన్నో ఏళ్లుగా నాని ఎదురు చూస్తున్న విజయం దసరాతో లభించింది. ధరణిగా అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్లో నాని జీవించేశాడు. దసరా దెబ్బకు థియేటర్లో మరో బొమ్మే కనిపించడలేదు. ఇక కొన్ని చోట్ల బలగం కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఓటీటీలోనూ గతవారం సినీ ప్రేమికులకు మంచి విందే దొరికింది. అమిగోస్, శ్రీదేవి శోభన్‌బాబు వంటి సినిమాలు ఓటీటీ ప్రియులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ప్రతి వారంలానే ఈ వారం కూడా అటు ఓటీటీ ఇటు థియేటర్లలో విందు భోజనం పెట్టడానికి మంచి మంచి సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఓ లుక్కేద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు:
రావణాసుర:
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న రవన్న ప్రస్తుతం అదే జోష్‌తో ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానుంది.
మీటర్:
హ్యట్రిక్ ఫ్లాపుల తర్వాత ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. పక్కంటి అబ్బాయిలా కనిపించే కిరణ్ ఈ సారి గేరు మార్చి మీటర్ వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమేష్ కాడురి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది.
ఆగస్టు16 1947:
కడలి ఫేం గౌతమ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 7న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. ఏ.ఆర్ మురుగుదాస్ ప్రొడ్యూసర్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఆహా:
బుర్ఖా (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 7
హాట్‌స్టార్:
రోమాంచమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 7
టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 9
అమెజాన్:
జుబిలీ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 7
జీ-5:
యోతి (తమిళ సినిమా) – ఏప్రిల్ 7
నెట్‌ఫ్లిక్స్:
బీఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 6
ఇన్ రియల్ లవ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 6
చుపా (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 7
ఓహ్ బెలిండా (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 7
ట్రాన్స్ అట్లాంటిక్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 7
హంగర్ (థాయ్ సినిమా) – ఏప్రిల్ 8
బుక్ మై షో:
బ్యాట్ మ్యాన్: ద డూమ్ దట్ కేమ్ టూ గోతమ్ (హాలీవుడ్ మూవీ) – ఏప్రిల్ 5
కాస్మోస్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 7
ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 7