Eid Mubarak | త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్) పండుగ సందర్భంగా నేడు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపాడు.
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్. ప్రతీ పండగలోను గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాం మతంలో విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి , శ్రద్దలతో జరుపుకొంటారో బక్రీద్ పండుగను కూడా అంతే నిష్టతో చేసుకొంటారు. ప్రవక్త మహ్మద్ త్యాగనిరతిని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈ పండుగ ముస్లింలందరికీ భగవధానుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను. ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ప్రారంభం అయ్యే ఈ శుభ దినాలలో ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చాడు.
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్
ప్రతీ పండగలోను గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాం మతంలో విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి , శ్రద్దలతో జరుపుకొంటారో బక్రీద్ పండుగను కూడా అంతే నిష్టతో చేసుకొంటారు. ప్రవక్త మహ్మద్ త్యాగనిరతిని స్మరించుకుంటూ…
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2024