‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అనుష్క.. క్రిష్ ‘ఘాటీ’తో మళ్లీ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఘాటీ’.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఓ మలయాళ చిత్రంలో కూడా స్వీటీ నటిస్తున్నారు. ఆ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఇదిలావుంటే.. అనుష్క రీసెంట్గా ఓ దర్శకుడి కథకు ఓకే చెప్పారట. ఆ దర్శకుడెవరో కాదు.. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్‌గా పేరు గాంచిన సుందర్.సి. బెంజ్ మీడియా సంస్థతో కలిసి సుందర్.సి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే ఈ సినిమా.. హారర్ కామెడీ జానర్లోనే ఉంటుందట.