Anushka Shetty | టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. హీరోగా విక్రమ్ ప్రభు నటించారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఈ సందర్భంగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో సినిమాపై, తన పాత్రపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఘాటి చిత్రంలో శీలావతి పాత్ర నాకు ప్రత్యేకమైనది. ఇప్పటివరకు చేసిన పాత్రల్లో భిన్నంగా ఉంటుంది.
ఇందులో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. ఇది కంఫర్ట్ జోన్ దాటి చేసిన ఛాలెంజింగ్ రోల్. నా ఫిల్మోగ్రఫీలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అని అనుష్క చెప్పారు. ‘వేదం’ తర్వాత మరోసారి క్రిష్ డైరెక్షన్లో నటించడం పట్ల అనుష్క ఆనందం వ్యక్తం చేశారు. “సరోజ్ పాత్రకు కొనసాగింపుగా ఏదైనా చేయాలనుకుంటూ ఉన్న సమయంలో ‘ఘాటి’ కథ వచ్చింది. క్రిష్ గారు ఎప్పుడూ నన్ను కొత్త కోణంలో చూపిస్తారు. ఈ సినిమా కూడా అలాంటి ప్రయోగమే” అని చెప్పుకొచ్చారు. ఇక్కడ గంజాయి ఎలిమెంట్ ఉన్నా, ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో ఒక పాజిటివ్ మెసేజ్ ఉంటుంది. ఆడియన్స్‌ని టచ్ చేస్తుంది అని వివరించారు. ‘కుందేటి చుక్క’ అనే పదం వినగానే నాకెంతో ఇష్టం వచ్చింది. చిన్న మాటలతో కథలో డెప్త్ తీసుకురావడం క్రిష్ స్టైల్. కెమెరామాన్ మనోజ్ విజువల్స్ అద్భుతంగా తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ ఇచ్చిన బీజీఎమ్ ఈ సినిమాకి ఒక ప్రత్యేక క్యారెక్టర్ లా పనిచేస్తుంది” అని వివరించారు.
ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై ఒక అవుట్ అండ్ అవుట్ నెగటివ్ పాత్ర చేయాలన్న కోరిక ఉంది. బలమైన పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ఒక మలయాళ సినిమా చేస్తున్నాను. అదే నా ఫస్ట్ మలయాళ ప్రాజెక్ట్. త్వరలోనే ఒక కొత్త తెలుగు సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. ఆ వివరాలు త్వరలో వెల్లడి అవుతాయి అని అనుష్క తెలిపారు. ఇప్పుడు ఎక్కువగా ట్రావెలింగ్, బుక్స్ చదవడం చేస్తుంటాను. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడుపుతున్నాను అని చెప్పారు.