Anushka – Ghaati | అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి(Ghaati). ఈ సినిమాకు వేదం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. 4 ఏండ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను వదిలింది.
ఈ సినిమాలో అనుష్క ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొండ లోయలలో నివసించే జీవితాల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇందులో అనుష్క ఒక బాధితురాలి నుంచి క్రిమినల్‌గా, అనంతరం లెజెండ్‌గా ఎలా మారింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటూ మేకర్స్ తెలిపారు. ఇక కొండపోలం వంటి భారీ డిజాస్టార్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.