అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం 80శాతం పూర్తయింది. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర ఉందట. ఆ పాత్రలో ఓ హీరో నటిస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. కాగా, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ పాత్రను రానా పోషిస్తున్నారని వినికిడి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాను మాటలు రాస్తున్న విషయం తెలిసిందే.