Anurag Kashyap | ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత రాబోతున్న చిత్రం ‘నిశాంఛి’ (Nishaanchi). అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆయిశ్వర్య్ థాకరే హీరోగా బాలీవుడ్‌కి పరిచయం అవుతుండగా, వేదిక పింటో, మోనికా పన్వార్, మహమ్మద్ జీషన్ అయ్యూబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 19, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కథ ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. వారిద్దరూ వేర్వేరు దారుల్లో పయనించడం వల్ల వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం.