Adolescence | బాలీవుడ్ దర్శకులంతా తాజాగా ఓటీటీలపై పడ్డట్లు తెలుస్తుంది. దిగ్గజ దర్శకుడు శేఖర్ కపూర్ అమెజాన్ ప్రైమ్ వీడియోపై విమర్శలు కురిపించిన ఘటన మరవకముందే తాజాగా మరో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్వప్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇండియా(Netflix India)పై దుమ్మెత్తిపోశాడు.
దర్శకుడు అనురాగ్ కశ్వప్ మాట్లాడుతూ.. బ్రిటిష్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘అడోలసెన్స్’ (Adolescence)పై ప్రశంసలు కురిపించాడు. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఇలాంటి సిరీస్‌ను తెరకెక్కించినందుకు గర్వంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ సిరీస్ చూస్తున్నంతా సేపు చాలా అసూయపడ్డాను. ఇలాంటి కథలు మనదగ్గర ఎందుకు రావడం లేదని అవేదన వ్యక్తి చేసినట్లు అనురాగ్ తెలిపాడు. ఈ సిరీస్‌లో నటించిన బాల నటుడు ఓవెన్ కూపర్, స్టీఫెన్ గ్రాహం నటన హ్యాట్సాఫ్. అయితే చెత్త ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇలాంటి కంటెంట్ తీసుకురావడం, ప్రయోగాలు చేయడం మానేసిందిని తెలిపాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా విధానాలు నీతిరహితంగా, అనైతికంగా ఉన్నట్లు ఆరోపించారు. సాక్రేడ్ గేమ్స్(Sacred Games) వెబ్ సిరీస్ తర్వాత నేను నెట్‌ఫ్లిక్స్‌తో రెండుసార్లు పనిచేశాను. కానీ అప్పుడు ఉన్నంత క్రియేటివిటీ, కొత్తదనం ఇప్పుడు లోపించింది. భారత్‌లో అడోలసెన్స్ లాంటి సిరీస్‌లను ఆమోదించరు. ఒకవేళ ఆమోదించిన దానిని 90 నిమిషాల సినిమా చేసేస్తారు అంటూ అనురాగ్ చెప్పుకోచ్చాడు.