Anurag Kashyap Left Bollywood | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు. పాంచ్(Paanch) సినిమాతో మెగాఫోన్ పట్టిన ఇతడు ఆ తర్వాత బ్లాక్ ప్రైడే (Black Friday), గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్(Gangs of Wasseypur), రామన్ రాఘవ్(raaman raghav), లస్ట్ స్టోరీస్(Lust Stories) తదతరి సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా అనురాగ్ సంచలన ప్రకటన చేశాడు. తాను బాలీవుడ్‌ని వదిలిపెట్టి సౌత్ ఇండస్ట్రీకి వెళుతున్నట్లు తెలిపాడు. హిందీ పరిశ్రమ ప్రస్తుతం విష వాతావరణంతో నిండి ఉన్నట్లు తెలిపాడు.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌ని విడిచి వెళ్లాలి అనుకుంటున్న. బాలీవుడ్ పరిశ్రమ ప్రస్తుతం (టాక్సిక్)విష వాతావరణంతో నిండి పోయింది. అందుకే ఇక్కడ నుంచి సౌత్ ఇండస్ట్రీకి వెళుతున్నాను. ఇక్కడ క్రియేటివిటీని ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికి రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు వచ్చే సినిమాలు కావాలి. అందుకే క్రియేటివిటీకి విలువ లేకుండా పోయింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వడంతో పాటు కథలకు ప్రాధన్యతను ఇవ్వడం, సినిమాను సినిమాలా తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఇక అనురాగ్ ప్రస్తుతం బెంగళూరు షిప్ట్ అయినట్లు తెలుస్తుంది.
సినిమా విషయాలకు వస్తే.. ఇటీవల మళయాళం సినిమా రైఫిల్ క్లబ్ (Riffile Club) సినిమాలో కీలక పాత్రలో నటించాడు అనురాగ్. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అడివి శేష్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో మృణాల్ థాకుర్ కథనాయికగా నటిస్తుంది.