‘కథ పాతదే అయినా.. తెరకెక్కించే విధానం కొత్తగా ఉంటే చాలు సక్సెస్ అదే వస్తుంది. అందుకే.. కథ ఎంత ముఖ్యమో, దాన్ని తెరకెక్కించే దర్శకుడి అభిరుచి కూడా అంతే ముఖ్యం’ అంటున్నది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో తాను ఏ విధమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందో ఇటీవల ఓ ఇంటర్వూలో ఆసక్తికరంగా తెలిపింది అనుపమ పరమేశ్వరన్.
‘ఇటీవల ఓ కథ విన్నాను. చాలా బాగుంది. అయితే.. కథ రైటర్ వినిపించారు. డైరెక్టర్ మాత్రం సైలెంట్‌గా కూర్చొని, నాతోపాటు వింటున్నారు. నాకెందుకో ఆ పద్ధతి నచ్చలేదు. కథ చెప్పాల్సింది దర్శకుడు. దాన్ని తెరకెక్కించాల్సిందీ దర్శకుడే. అలాంటి స్థానంలో ఉండి, అలా సైలెంట్‌గా కూర్చోవడం నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. సినిమా లొకేషన్ ఓ పిక్నిక్లా ఉండాలని కోరుకుంటాన్నేను. డైరెక్టర్ సైతం మాతో కలిసిపోవాలి. సరదా సరదాగా షూటింగ్ జరగాలి.
అలా అయితే అవుట్‌పుట్ కూడా బావుంటుంది. అందుకే.. యువతరంతో పనిచేసేందుకే నేనెక్కువగా ఇష్టపడతా. అలాగే కొత్తవాళ్లతో ఇంటిమేటెడ్ సీన్స్ అంటే కూడా నేను ఇబ్బందిగా ఫీలవుతా. కథ డిమాండ్ చేసినా, పరిచయం లేనివారితో చనువుగా ఉండే సన్నివేశాలు చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. నా వరకూ సినిమా ఓకే చేసే విషయంలో కథతోపాటు దర్శకుడు కూడా నాకు ట్యూన్ అవ్వాలి. అప్పుడే సినిమాను అంగీకరిస్తా. కథ బాగుండి, దర్శకుడు విషయంలో డౌట్ వల్ల వదులుకున్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి’ అంటూ గుర్తు చేసుకున్నది అనుపమ పరమేశ్వరన్.