రౌడీ బాయ్స్ ట్రైలర్ విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ‘జోష్’కు సీక్వెల్ లా..?

Rowdy Boys trailer | దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా నాగచైతన్య తొలి సినిమా జోష్ గుర్తుకు రాక మానదు. చాలా వరకు అదే ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి.

అయితే ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్డ్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ఇది నాకు నోస్టాలజిక్ డే. ఎందుకంటే ఆది సినిమా సమయంలో దిల్ రాజు, శిరీష్‌తో అసోషియేషన్ ఏర్పడింది. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్‌తో అప్పటి వరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్‌ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా దిల్ రాజు, శిరీష్‌తో ఉండే జర్నీని గుర్తు చేసుకున్నట్లు అయ్యింది. రౌడీ బాయ్స్ ట్రైలర్‌ను లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్‌కి, డైరెక్టర్ శ్రీహర్షకి అభినందనలు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి మంచి చిత్రాల్లో తను భాగం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాను థియేటర్స్‌లోనే చూడాలని కోరుకుంటున్నాను’’ అని ఎన్టీఆర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..
అనుపమతో చనువుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
వ్యవసాయం చేస్తున్న త్రివిక్రమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ ను హ్యాపీగా ఉంచేది ఏంటంటే..!
Anupama: అనుపమ అడ్డుకట్టలు తొలగించి లిప్‌లాక్‌లతో చెలరేగిపోనుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

