Tillu Square Trailer | రెండేండ్ల కింద వచ్చిన డీజే టిల్లు టాలీవుడ్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. అందుకే దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు టిల్లు స్క్వైర్ను తీసుకొస్తున్నారు. మాలిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. ఇక టిల్లు స్క్వైర్ నుంచి వచ్చిన టీజర్ ఈ సినిమాపై హైప్ పెంచేశాయి. మొదటి పార్ట్‌లో తరహాలో ఇందులో కూడా క్రైమ్ కామెడీతో సిద్దూ ఏ రేంజ్లో ఆకట్టుకుంటాడో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే సందర్భంగా టిల్లు స్క్వైర్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో సిద్దూ జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. అనుపమ పరమేశ్వరన్, సిద్దూ మధ్యలో వచ్చే సీన్స్ కూడా చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. ఈ సీన్స్ చూస్తుంటే అనుపమ ఈసారి గ్లామర్ హద్దులు చెరిపేసి రెచ్చిపోయిన నటించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మొదటి పార్ట్‌లో రాధికతో క్రైమ్ ఎపిసోడ్ మాదిరిగానే ఇందులోనూ మరో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. అన్నట్టు ఈ సినిమా మార్చి 29వ తేదీన విడుదల కానుంది.