Anupama Parameswaran | ఒకప్పుడు పద్దతిగా ఉండే అనుపమ.. ఇప్పుడు రూటు మార్చింది. సినిమాలలో కూడా రెచ్చిపోయి నటిస్తుంది. లిప్ లాక్‌ల విషయంలో కూడా తగ్గేదే లే అంటుంది. అయితే అనుపమకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ షేక్ చేస్తుంది. అనుపమ.. ఇప్పుడు విక్రమ్ తనయుడితో ధ్రువ్ తో డేటింగ్లో ఉందా అంటూ కొందరు నెట్టింట జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. అందుకు కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలో అనుపమ లాగా కనిపించే ఒక అమ్మాయి, ధ్రువ్ లాగా కనిపించే వ్యక్తిని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇది నిజంగా అనుపమ, ధృవ్నేనా అని కొందరు కామెంట్ చేస్తుండాగా, మరి కొందరు ఈ ఫొటో సినిమాలోనిదని అంటున్నారు.
ధ్రువ్, అనుపమ కలిసి ‘బైసన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ.. ధ్రువ్‌కి ప్రేయసిగా నటిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఫొటో లీక్ అయి ఉండవచ్చని అంటున్నారు. మరి ఈ విషయంపై అనుపమ, ధ్రువ్, మూవీ టీం కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, అనుపమ పరమేశ్వరన్ తెలుగు చిత్ర సినిమాకు ఎంతో సుపరిచితం. తన రింగు రింగుల జుట్టుతో తెలుగు ప్రేక్షకులను మనసు దోచుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ అ..ఆ.. సినిమాతో తెలుగు ప్రేక్షకలని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక శతమానం భవతి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, కార్తికేయ2 వంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో కూడా నటించి అనుపమ మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల అవకాశాలు తగ్గడంతో కాస్త బోల్డ్‌గా నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డతో నటించిన టిల్లు స్క్వేర్ లో అనుపమ రెచ్చిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డును బ్రేక్ చేసింది. అసలు ఈ సినిమాలో హీరోయిన్ అనుపమనేనా ? అనేలా ఈ అమ్మడు తన అందంచందాలతో అదరగొట్టింది. ఏది ఏమైన ఇప్పుడు అనుపమకి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
#DhruvVikram and #AnupamaParameswaran Dating?🧐🤯 pic.twitter.com/NE9OXyyMsh
— SillakiMovies (@sillakimovies) April 13, 2025