గ్లామరస్ రోల్స్ తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కనిపించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది కోలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ భామ నేటితో 25వ పడిలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా అనుపమకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అనుపమ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం బట్టర్ ఫ్లై (Butter Fly first look). ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో సీతాకోకచిలుకలా కలర్ ఫుల్‌గా డిజైన్ కనిపిస్తుండగా..అనుపమ బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు సతీశ్ బాబు (Ghanta Satish Babu). ఇంతకీ ఏ జోనర్ లో సినిమా రాబోతుందనే దానిపై రానున్న టైంలో క్లారిటీ రానుంది. ఈ చిత్రాన్ని ఘంటా సతీశ్ బాబు స్వీయ రచనలో డైరెక్ట్ చేశాడు. జెన్ నెక్ట్స్ మూవీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్విజ్, గిడియాన్ కట్టా మ్యూజిక్ డైరెక్టర్లు. ప్రస్తుతం బట్టర్ ఫ్లై సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇటీవలే ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుపమ. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.