Anupam Kher | భారత్-పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాకిస్థాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేస్తుంటే, భారత్, పాక్ లోని 9 నగరాల్లో దాడులకి దిగింది. పాక్ 50కి పైగా డ్రోన్లని భారత్‌పైకి ప్రయోగించింది. అయితే మన దగ్గర S400 అనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ఉండడంతో పాకిస్థాన్ నుంచి వస్తున్న మిస్సైళ్లను అడ్డుకుంటోంది. అలాగే.. డ్రోన్లను కూడా అడ్డుకొని నాశనం చేస్తోంది. భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ ఉలిక్కి పడింది. ముఖ్యంగా పాక్ రాజధాని షెహబాజ్ షరీఫ్‌ని సురక్షిత ప్రాంతంలోకి తీసుకుపోయింది. పాకిస్థాన్ ప్రధానంగా.. జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది.
ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ గాల్లో పేలుళ్లకి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశారు. జమ్మూలో ఉంటున్న ఆయన కజిన్ సునీల్ ఖేర్ తన ఇంటి నుంచి ఈ వీడియో పంపాడని తెలియజేశాడు. అయితే అది చూసి నేను వెంటనే అతనికి ఫోన్ చేశాను. మీరూ మీ కుటుంబం సురక్షితంగా ఉన్నారా అని అడిగా. ఆయన గర్వంగా నవ్వి, ‘భయ్యా, మేము ఇండియాలో ఉన్నాం. మేము హిందుస్తానీలం. భారత సైన్యం, మాతా వైష్ణోదేవి మమ్మల్ని కాపాడుతున్నారు. నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు. ఏ క్షిపణిని నేల మీద పడనివ్వం. జై మాతా దీ. భారత్ మాతాకీ జై అని అన్నాడని అనుమపమ్ ఖేర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా అనుపమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. భారత్ మాతా కీ జై #ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్ కుటుంబం నుంచి వచ్చిన అనుపమ్ ఖేర్ సిమ్లాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు కశ్మీర్‌వారు. ఆయన సోదరుడు రాజు ఖేర్ బారాముల్లాలో పుట్టారు. 2022లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రమోషన్ సమయంలో, 1990లో కశ్మీరీ పండిట్ల వలసల గురించి, తన కుటుంబం ఎలా పారిపోవాల్సి వచ్చిందో ప్రత్యేకంగా ఓ వీడియో రూపంలో తెలియజేశాడు. తన తల్లి, సోదరుడు ఎంత హింసకి గురయ్యారో, ఎలా ఇల్లు వదిలి వెళ్లవలసి వచ్చిందో, బాధతో ఎలా చనిపోయాడో వివరించారు అనుపమ్ ఖేర్. ఈ బాలీవుడ్ నటుడు ఇటీవల తెలుగు సినిమాలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
My cousin brother #SunilKher sent this video from his home in Jammu. I called immediately and asked him if he and his family are ok? He laughed a little proudly and said, भैया! हम भारत में है! हम हिंदुस्तानी है।हमारी सुरक्षा भारतीय सेना और माता वैष्णो देवी कर रही है।आप टेंशन मत… pic.twitter.com/fv8UmCILC0
— Anupam Kher (@AnupamPKher) May 8, 2025