Tiger Nageswara Rao | రవితేజ (Ravi Teja) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)లో నటిస్తున్నాడని తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో వస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తు్న్నారు.
తాజాగా ఆయన లుక్ విడుదల చేసి మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది మాస్ మహారాజా టీం. అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తున్నట్టు తాజా లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదల చేసిన ఈ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. టైగర్ నాగేశ్వరరావులో గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర్రావు అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023