Shah Rukh Khan as the next Avenger | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కి హాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాతో పాటు ఓవర్సీస్లో షారుఖ్‌కి మంచి మార్కెట్ ఉంది. అయితే షారుఖ్ హాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటారు. కానీ ఇప్పటివరకు ఆ అదృష్టం అయితే దక్కలేదు. అయితే షారుఖ్‌ని అవెంజర్స్ సూపర్ హీరోగా చూడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు హాలీవుడ్ నటుడు ఆంతోనీ మాక్.
ఆంథోనీ మాకీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని కెప్టెన్ అమెరికా చిత్రాలలో సూపర్ హీరోగా అలరించాడు. అయితే ఈ ప్రాంఛైజీ నుంచి వస్తున్న తాజా చిత్రం కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (Captain America: Brave New World). జూలియస్ ఓనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిగ్గజ నటుడు హారిసన్ ఫోర్డ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నెక్స్ట్ అవెంజర్ని బాలీవుడ్ నుంచి తీసుకోవాల్సి వస్తే.. ఎవరిని ఎంచుకుంటారు అంటూ మాకీని అడుగగా.. మాకీ సమాధానమిస్తూ.. షారుఖ్ ఖాన్ అని చెబుతాడు. షారుక్ అయితే నెక్స్ట్ అవెంజర్‌గా సెట్ అవుతాడు. అతడిని సూపర్ హీరోగా చూడడం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.