Ari Movie | టాలీవుడ్లో భక్తి సినిమాలకు ఎలాంటి ఆదరణ ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేవుళ్ల మీద సినిమాలు వస్తున్నాయంటే ప్రత్యేకించి ఎదురుచూసే మూవీ లవర్స్ సంఖ్య భారీగానే ఉంటుంది. సినిమాల కథానుగుణంగా దేవుడిని ఏ రూపంలో చూపించినా ఆ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే అఖండలో శివుడు, హనుమాన్‌లో హనుమంతుడు, కల్కి 2898 ఏడీలో కృష్ణుడిని చూపించిన తీరుకు జనాలు నీరాజనాలు పలుకడమే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి.
ఈ సినిమాకు పార్టు 2లు కూడా రాబోతున్నాయంటే ఈ జోనర్ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంతార, కార్తికేయ 2, ఓ మై గాడ్ సినిమాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక టాలెంటెడ్ నటి అనసూయ భరద్వాజ్ (Anasuya baradwaj) లీడ్ రోల్లో నటించిన సినిమా కూడా ఇదే లైన్లో రాబోతుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పేపర్‌బాయ్ ఫేం జయశంకర్ డైరెక్టర్ చేస్తున్న సినిమా కూడా సేమ్ థీమ్‌తో ఉండబోతుందట. తాజా టాక్ ప్రకారం కల్కి 2898 ఏడీలో హైలెట్‌గా నిలిచినట్టుగానే.. అరి (Ari Movie) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో కూడా కృష్ణుడిదే లీడ్ రోల్ అని జోరుగా టాక్ నడుస్తోంది.
చాలా రోజుల క్రితమే ప్రకటించిన అరి చిత్రం మళ్లీ తాజా అప్డేట్తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎవరూ టచ్ చేయని విధంగా అరిషడ్వర్గాలనే ఇతివృత్తం నేపథ్యంలో మూవీ సాగనుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రంలో సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అరి ట్రైలర్..
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్