నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకొని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్ఆర్-100 కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఏఎన్ఆర్ ఐకానిక్ ఫిల్మ్ ‘దేవదాసు’ స్క్రీనింగ్‌తో శుక్రవారం ఈ చిత్రోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు పేరుతో పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా 31నగరాల్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నాం. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నాన్నగారి పేరు మీద ఓ ఛాప్టర్ చేస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవిగారికి ఇవ్వాలని నిర్ణయించాం. ఈ విషయం చెప్పగానే ఆయన చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు.
అక్టోబర్ 28న అమితాబ్ బచ్చన్‌గారు ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తారు.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, రాఘవేంద్రరావు, శివేంద్రసింగ్ దుంగార్పూర్, వెంకట్ అక్కినేని, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కినేని ఫిల్మ్ ఫెస్టివల్లో దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్‌నగర్, ప్రేమాభిషేకం, మనం చిత్రాలను ప్రదర్శించనున్నారు.