Jabardasth Auto Ram Prasad | డైరెక్టర్గా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్.?
Jabardasth | ప్రముఖ టీవి ఛానల్ ఈటీవిలో టెలికాస్ట్ అయ్యే జబర్ధస్త్ షో తెలుగునాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్లుగా ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్ నటులు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు
Jabardasth | ప్రముఖ టీవి ఛానల్ ఈటీవిలో టెలికాస్ట్ అయ్యే జబర్ధస్త్ షో తెలుగునాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్లుగా ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్ నటులు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. సుధీర్ హీరోగా సక్సెస్ అవ్వగా.. బలగం సినిమాతో డైరెక్టర్గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు వేణు యెల్దండి. ధనరాజ్ కూడా రామం రాఘవం అంటూ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీరితో పాటు ఆది, గెటప్ శ్రీను, మహేష్, చమ్మక్ చంద్ర ఇలా పలువురు నటులుగా ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే వేణు, ధనరాజ్ తరహాలోనే మరో బజర్దస్త్ నటుడు దర్శకుడిగా మారనున్నట్లు తెలుస్తుంది.
జబర్దస్త్ కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తుంది. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్లను హీరోలుగా పెట్టి ఆటో రాంప్రసాద్ ఓ కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కథ నిర్మాతలకు నచ్చి అన్నీ కుదిరితే ఈ సినిమాను పట్టాలెక్కిస్తాం అని గెటప్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

