ఈనెల 26 నుంచి దేశవ్యాప్త నిరసనలు : ఎస్కేఎం
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి ఆరేండ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి నవంబర్ 26 నుంచి దేశవ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి ఆరేండ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి నవంబర్ 26 నుంచి దేశవ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. 2021 నవంబర్ 19న మూడు చట్టాలను రద్దు చేసినా.. అప్పుడు ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలు చేయలేదని.. వాటి సాధన కోసం 100 ప్రాంతాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు ఎస్కేఎం వెల్లడించింది.
స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయడం, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయడం, ఉపాధిహామీ పథకంలో 200 రోజుల పని, రూ.700 రోజువారీ వేతనం, విద్యుత్ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, జాతీయ ఆహారభద్రత బిల్లులను ఉపసంహరించుకోవడం, బలవంతపు భూసేకరణను నిలిపివేయడం తమ ప్రధాన డిమాండ్లు అని ఎస్కేఎం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

