మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం నాలుగు రోజులే మిగిలి ఉండగా, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు కీలకమైన ceotelangana.nic.in వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓటరు నమోదుకు సంబంధించిన ఫామ్-18 ఆన్లైన్ లింక్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తున్న పట్టభద్రులకు రెండు రోజుల నుంచి (ఆదివారం-సోమవారం) సాంకేతిక సమస్య ఎదురవుతున్నది.
- ఫామ్-18 వెబ్‌లింక్‌లో ఎర్రర్
- ఆన్లైన్ దరఖాస్తులకు అంతరాయం
- పట్టభద్రుల ఓటరు నమోదుతుదిగడువు నవంబర్ 6
- గడువు పొడిగించాలని పలుపార్టీల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం నాలుగు రోజులే మిగిలి ఉండగా, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు కీలకమైన ceotelangana.nic.in వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓటరు నమోదుకు సంబంధించిన ఫామ్-18 ఆన్లైన్ లింక్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తున్న పట్టభద్రులకు రెండు రోజుల నుంచి (ఆదివారం-సోమవారం) సాంకేతిక సమస్య ఎదురవుతున్నది. వెబ్సైట్లో ఎర్రర్ 503: సర్వీస్ ఆన్అవైలబుల్ అనే సందేశం కనిపిస్తున్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన అర్హులంతా ఫామ్-18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అయితే సీఈవో వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తున్నది.
రాష్ట్రంలోని ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత ఎన్నికల సమయంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 10.36 లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఇప్పటివరకు సుమారు 9 లక్షల దరఖాస్తులే వచ్చినట్టు సీఈవో కార్యాలయవర్గాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటరు నమోదు గడువును పొడిగించాలని ఇప్పటికే బీఆర్ఎస్తోపాటు ఇతర రాజకీయ పక్షాలు ఎన్నికల అధికారులను కోరాయి. ఆన్లైన్ లింక్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో చివరి తేదీవరకు వేచి ఉండకుండా అర్హులైన పట్టభద్రులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా వినియోగించుకోవాలని సీఈవో అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

