బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ బ్యూటీ సంజనా గల్రాని. తెలుగులో యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన సంజన కన్నడలో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంది. అయితే ఇటీవల డ్రగ్స్ కేసు విషయంలో ఇరుక్కున్న సంజన హెడ్ లైన్స్‌లో నిలిచింది. కొన్నాళ్లు జైలులో కూడా ఉన్న ఈ ముద్దుగుమ్మ బయటకు వచ్చాక మీడియా కంట కనపడకుండా తిరిగింది.
గత ఏడాది లాక్డౌన్ సమయంలో ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడింది సంజన. అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో నిజమెంత ఉందనేది అభిమానులకు అర్ధం కాలేదు. ఈ క్రమంలో తన పెళ్లిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సంజనా. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే పెళ్లైన కొద్ది రోజులకే నేను డ్రగ్స్ కేసు ఇష్యూలో ఇరుక్కోవడంతో నా పెళ్లి వార్తను ఇండస్ట్రీ వర్గాలతో పంచుకోలేకపోయాను. ఘనంగా రిసెప్షన్ అయిన చేసుకుందామని అనుకున్నా, లాక్డౌన్ వలన సాధ్యం కాలేదని పేర్కొంది. ఈ అమ్మడు తాజాగా అవసరమైన వారికి నిత్యావసర సరుకులు అందించి మంచి మనసు చాటుకుంది.
Heroine #SanjanaGalrani provided food to the needy and daily groceries to the film industry workers in Bangalore through her Sanjana Galrani Foundation pic.twitter.com/MvSjzhWWUk
— BA Raju's Team (@baraju_SuperHit) June 4, 2021