Devara – Anirudh Ravichander | ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకకు.. ముఖ్య అతిథులుగా.. ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ, రాజమౌళి, అనిరుధ్ రవిచందర్, నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. దేవర అనే చిత్రం ఫస్ట్ ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్‌తో మొదలైంది. ఎన్టీఆర్30 సినిమా కోసం సంగీత దర్శకుడిగా అనిరుధ్ కావాలంటూ ట్విట్టర్లో అప్పుడు తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు చూస్తే.. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాను. తారక్ నాకు పెద్దన్నయ్య లాంటి వాడు. ఈ వేడుకలో జాన్వీని మిస్ అవుతున్నాను. ఈ మూవీ రెండో పార్ట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నేను ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశాను. థియేటర్ అంతా పండుగలా ఉండింది. మూవీలో చూట్టమల్లే సాంగ్ వస్తున్నప్పుడు ఆహ్ అంటూ సౌండ్ చేస్తున్నారు. ఇది చాలా వైరల్ అవుతుంది. చివరిగా.. ”దేవర అడిగినాడంటే సెప్పినాడని”.. ”అదే సెప్పినాడు అంటే ఆల్ హెయిల్ ది టైగర్” అంటూ అనిరుధ్ చెప్పుకోచ్చాడు.