అనిల్ రావిపూడి దర్శకత్వంలో యానిమేటెడ్ రామాయణం?
తెలుగు సినీరంగంలో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని అందించడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
తెలుగు సినీరంగంలో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని అందించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్-కల్యాణ్‌రామ్‌లతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా అనిల్ రావిపూడి లైనప్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతున్నది. భారతీయ పురాణేతిహాసం రామాయణ గాథను యానిమేటేడ్ వెర్షన్లో తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నది.
ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. 2024లో వచ్చిన ‘మహావతార్ నరసింహా’ యానిమేషన్ ఫిల్మ్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో రామాయణ ఆధారంగా ఓ యానిమేటెడ్ ఫిల్మ్‌కు కేవీఎన్ ప్రొడక్షన్ శ్రీకారం చుట్టిందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో ఆధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, త్వరలో అధికారిక ప్రకటన
ఉంటుందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

