Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల తేదీకి ఇంకా 20 రోజులు గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. మరీ ముఖ్యంగా తెలుగులో భారీ ఎత్తున ప్రమోషన్లు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, రష్మికలతో పాటు రణ్‌బీర్ కపూర్ లు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు రానున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ జరగబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో ఇటీవలే మూడో సీజన్‌ను ప్రారంభించింది. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ మూడో సీజన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్లో భగవంత్ కేసరి టీం సందడి చేసింది. మరోవైపు గతంలో రణ్‌బీర్ కపూర్ తన భార్య అలియా భట్‌తో కలిసి బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్ల కోసం తెలుగు క్యాష్ షోకు వచ్చాడు.