Anil Ravipudi Next Movie | కామెడీ టైమింగ్‌ను కరెక్ట్‌గా ప్రజెంట్ చేయడంలో అనిల్ రావిపూడి దిట్ట. ఇప్పుడున్న దర్శకులలో కామెడీని బాగా హ్యాండిల్ చేయగలిగే వాళ్లలో అనిల్ రావిపూడి పక్కా టాప్ పేస్‌లో ఉంటాడు. అయితే ఈ సారి తన కంఫర్ట్ జానర్‌కు భిన్నంగా బాలయ్యతో భగవంత్ కేసరి అనే అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కాగా తాజాగా అనీల్ ఓ పెద్ద హీరోను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
మరో రెండు రోజుల్లో భోళాతో మురిపించనున్న చిరుతో అనిల్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయట. చంటబ్బాయి స్టైల్లో ఈ సినిమా ఉంటుందని ఇన్సైడ్ టాక్. చంటబ్బాయి అనగానే కేవలం కామెడీనే అనుకునేరు. బీ, సీ సెంటర్ల జనాల కోసం రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి మాస్ హంగులు కూడా బాగానే దట్టించనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకున్నాడట. ఇక ఫైనల్ నెరేషనే తరువాయిని టాక్. చిరు సైతం ఫైనల్ నెరేషన్ నచ్చితే మట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి భగవంత్ కేసరి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు.
ఇక చిరు తన నెక్స్ట్ సినిమాను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేస్తున్నాడు. భోళా శంకర్ రిలీజయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా త్రిష నటించనుంది. దీని తర్వాత బింబిసార దర్శకుడు వశిష్ఠతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే బడ్జెట్ సహా కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కాస్త లేట్ అయ్యేలా ఉంది. దాంతో ఈలోపు పైనల్ నెరేషన్ నచ్చితే ఈ ప్రాజెక్ట్‌ను లాక్ చేసుకుంటాడట. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.