Anil Ravipudi | టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న అనిల్, గత సంక్రాంతికి వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే జోరుతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘మీసాల పిల్ల’ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన వెంకటేష్ – చిరంజీవి మాస్ సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాటకి కూడా తెగ రీల్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెంకటేష్, చిరంజీవి పాట విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ అనుకోకుండా ఓ కీలక లీక్ ఇచ్చారు.
సినిమా క్లైమాక్స్‌లో వెంకటేష్ పాత్ర ఎంట్రీ ఉంటుందని, దాదాపు 25 నిమిషాల పాటు వెంకటేష్ సందడి చేయనున్నారని అనిల్ వెల్లడించారు. అంతకుమించి వివరాలు చెబితే థ్రిల్ పోతుందని చెప్పి అక్కడితో ఆపేశారు. అనిల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్ చిరు-వెంకీ పాటకి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించాడు. అనీల్ జోష్ చూస్తుంటే ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్కు మెగాస్టార్ మాస్ ఇమేజ్ తోడవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాలి.