Anil Ravipudi | హీరోయిన్ను ఫైనల్ చేసిన అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా..?
Anil Ravipudi | అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోను సెట్ చేశాడని తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరెవరు కనిపిస్తారనే దానిపై పలు వార్తలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Anil Ravipudi | ఈ ఏడాది చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోను సెట్ చేశాడని తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరెవరు కనిపిస్తారనే దానిపై పలు వార్తలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.
ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వన్ ఆఫ్ ది గెస్ట్‌గా హాజరయ్యాడు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన నెక్ట్స్ సినిమాలో కృతిశెట్టి వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు తెలిపాడు. కృతిశెట్టి నందమూరి కళ్యాణ్ రామ్‌కు జోడీగా కనిపించబోతుందట. మరి వెంకటేశ్‌తో రొమాన్స్ చేయబోయేది ఎవరనేది సస్పెన్స్ నెలకొంది.
షైన్ స్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సంక్రాంతి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఇంతకీ ఈ ప్రాజెక్టు కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథను సిద్ధం చేశాడు. రెండో హీరోయిన్ ఎవరై ఉంటుందనే దానిపై ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Read Also :
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

