Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతి స్పెషల్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు నుంచే హౌస్‌ఫుల్ షోస్‌తో రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిసిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా విజయం వెనుక ఉన్న అనుభూతులు, చిరంజీవితో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. సినిమాను చూసి పవన్ కళ్యాణ్ అభినందించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అనిల్ తెలిపారు.పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని పలువురు దర్శకులు, హీరోలు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, మెసేజెస్ పంపారు. ఈ విజయం కేవలం మా టీమ్‌ది మాత్రమే కాదు… ఇండస్ట్రీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసిన ఫీలింగ్ కలిగింది” అని చెప్పారు.
చిరంజీవి లుక్ గురించి మాట్లాడుతూ .. ఫస్ట్ ఫోటోషూట్లోనే చిరంజీవి గారి లుక్ చూసి స్టన్నింగ్ అనిపించింది. గ్లామర్, ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఈ లుక్‌తో సినిమా అంతా ఉంటే ఆడియన్స్ ఫిదా అయిపోతారని అప్పుడే అనిపించింది. వింటేజ్ మెగాస్టార్‌ను మళ్లీ తెరపై చూపించే అవకాశం రావడం నా కెరీర్లో ఒక గొప్ప గిఫ్ట్ అని తెలిపారు. “నేను చిరు, వెంకీ సినిమాలు చూసి పెరిగాను. అలాంటి స్టార్లను డైరెక్ట్ చేయడం మాత్రమే కాదు… వాళ్లతో కలిసి డాన్స్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. బెల్ట్ స్టెప్‌ను పర్ఫెక్ట్గా చేయమని చిరంజీవి గారు నన్ను ఎంకరేజ్ చేసిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని గుర్తు చేసుకున్నారు. సినిమాలో చిరంజీవి నటించిన మందు సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంపై స్పందించిన అనిల్… చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీన్ ఆయన మేనరిజమ్స్‌తో పాటు వెంకటేష్‌తో ఉన్న కనెక్షన్‌ను కూడా చూపిస్తుంది. థియేటర్లో ఆ సీన్ అదిరిపోయింది. అయితే ఇది సరదా కోసమే… పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి” అని స్పష్టం చేశారు.