అదే నిజమైన ఆనందం
అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన చిత్రాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ ‘హై’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన చిత్రాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ ‘హై’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టడంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. అనన్యశర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
‘ప్రతి వ్యక్తి తాను జీవితంలో కోరుకునే ఆనందం, ఉత్సాహం వెనక ఉన్న భావోద్వేగ, మానసిక, నైతిక సంఘర్షణలకు అద్దం పట్టే చిత్రమిది. థ్రిల్‌ని వెతుక్కుంటూ చెడు మార్గాల్లో వెళితే ఎప్పటికైనా ప్రమాదమే. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనే జీవితం తాలూకు నిజమైన ఆనందం దాగి ఉంది అనే సత్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

