F3 Movie On OTT | ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు జపిస్తున్న మంత్రం ‘ఎఫ్-3’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ అంతేగా అంతేగా అంటూ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. వెంకీ, వరుణ్‌ల కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అనిల్ రావిపూడి మరోసారి ఆడియెన్స్‌ను రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా చేశాడు. ప్రస్తుతం చిత్రబృందం సక్సెస్ ప్రమోషన్లను జరుపుతుంది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి,వెంకీ, వరుణ్‌లు ఓటీటీ విడుదల తేదీ గురించి తెలిపారు.
‘ఎఫ్-3’ చిత్రం ఇప్పట్లో ఓటీటీలోకి రాదని.. మినిమం 2 నెలల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలన్ని నెలలోపే ఓటీటీలో సందడి చేశాయి. కానీ ఈ చిత్రం మాత్రం రెండు నెలల వరకు రాకపోవడం అనేది విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించగా సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. మేకర్స్ జూన్ 4న వైజాగ్‌లోని ఆర్కే బీచ్ దగ్గరున్న గోకుల్ పార్క్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోనున్నట్లు తాజాగా వెల్లడించారు.