మళ్లీ సంక్రాంతికి వస్తున్నారా?
దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రాలతో వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో బ్లాక్‌బస్టర్స్ హిట్స్ కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రాలతో వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో బ్లాక్‌బస్టర్స్ హిట్స్ కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అక్కినేని అఖిల్‌తో ఆయన సినిమా చేయబోతున్నారని సోషల్‌మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్‌తోనే తన తదుపరి చిత్రాన్ని చేయడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారని తెలిసింది.
అయితే ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ కాదని అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌ను ఇప్పట్లో పట్టాలెక్కించే ఆలోచన లేదని అనిల్ రావిపూడి ఇటీవలే మీడియా సమావేశంలో తెలిపారు. ఈసారి సరికొత్త కథతో ఆయన ముందుకురాబోతున్నారని అంటున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ వంటి హిట్ చిత్రాలు రావడంతో ఈ ఐదో సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించి 2027 సంక్రాంతి బరిలో దించాలన్నది మేకర్స్ ప్లాన్‌గా చెబుతున్నారు. సాహు గారపాటి-సురేష్‌బాబు నిర్మిస్తారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

