హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా, శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. నెలరోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్లో రామ్, భాగ్యశ్రీబోర్సేపై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరిస్తున్నారు.
ఈ నైట్ షెడ్యూల్ పదిరోజుల పాటు జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఆ తర్వాత ైక్లెమాక్స్, కీలక సన్నివేశాలను 20రోజుల పాటు డే టైమ్‌కి షూటింగ్ షిప్ట్ అవుతుందని, ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని మేకర్స్ తెలిపారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సంగీతం: వివేక్, మెర్విన్.